విజయాన్ని గుండెలకు హత్తుకునేది
ఓటమి ముంగిట ఓదార్చేది
కన్నీటి భాషను చదవగలిగేది
స్నేహమొక్కటే.. అదే లేకపోతే
జీవితానికి అర్థమేమిటి?
ఆనందాన్ని పంచేది
బాధలను దూరం చేసేది
బతుకులోని బాంధవ్యాన్ని
ఎప్పుడడిగినా ఇచ్చేది
ఆత్మీయత ఒక్కటే.. అదే లేకపోతే
మనుగడలో మాధుర్యమేమిటి?
కుగ్రామంగా మారిన ప్రపంచంలో
అమ్మలా నడిపించేది
నాన్నలా బాధ్యతగలది
మైత్రి ఒక్కటే.. అదే లేకపోతే
లోకంలో మిగిలేదేమిటి?
స్వార్థం దరిజేరనిది
మోసానికి చోటులేనిది
నేస్తమొక్కటే.. అదే లేకపోతే
సహజీవన సూత్రమేమిటి?
శూన్యం తరుముతున్నా
కన్నీటి కట్టలు తెగిపోయినా
ఆనందపు అలలలో కొట్టుకుపోయినా
స్నేహ కవచం.. నీచుట్టూ ఉంటే
విజయం నీవెంట.. విజేతవు నీవేనంట..
(స్నేహితులకు అంకితం…)
శాంతిశ్రీ
5 జనవరి, 2011 9:30 AMకి
chala bagundi .simply superb
www.mahimasri.com