సినిమాల్ని కుదిద్దామా..!

వేసవి సెలవులు వచ్చేసారు… వేసవి విడిదికి వెళుతున్నప్పుడో.. ఒంటరిగా ఇంట్లోనే ఉంటున్నప్పుడో మనకు కాలక్షేపం కావాలంటే ఈ చిన్న సాఫ్ట్‌వేర్‌ను ఇనిస్టాల్‌ చేసుకోండి. ఫార్మేట్‌ను మీకు తోచినట్లు మార్చుకోవచ్చు. కావల్సినమేరకు కుదించుకోవచ్చు. సాప్ట్‌వేర్‌ పేరేంటంటే.. మీడియాకోడర్‌.. మరి ఈ సాఫ్ట్‌వేర్‌ సంగతులేంటో తెలుసుకుందామా…!

ఎలా అంటే…

ఇనిస్టాల్‌ చేయగానే మెనూబార్‌, టూల్‌బార్‌తో చిన్న విండోలో ఓపెన్‌ అవుతుంది. టూల్‌బార్‌లోని ‘ప్లస్‌(+)’ మార్కుపై ఎంటర్‌ క్లిక్‌ చేసి ఆడియో, ఇమేజ్‌.. ఇలా మార్చుకోవాలనుకున్న ఫైల్స్‌ను యాడ్‌ చేసుకోండి. మళ్లీ ఆ ఫైల్‌ వద్దనుకుంటే ‘ఎక్స్‌’ (x) మార్క్‌ను క్లిక్‌ చేస్తే పోతుంది. ఈ టూల్‌లోనే ఆడియో, వీడియోలను ప్లే చేయాలనుకుంటే టూల్‌బార్‌లోని ‘ప్లే’ (play) బటన్‌పై క్లిక్‌ చేయండి. దీంతో ప్రత్యేకంగా విండో వచ్చి అందులో వీడియో ఓపెన్‌ అవుతుంది. తర్వాత కింద ఉన్న జెనరిక్‌ (Generic), వీడియో (Video), ఆడియో (Audio), పిక్చర్‌ (Picture), సౌండ్‌ (Sound)ను ఎంపిక చేసుకొని మీకు కావాల్సినట్లు మార్చుకోండి. ఉదా: సినిమాని మొబైల్‌ ఫార్మేట్‌లోకి మార్చుకోవాలనుకుంటే ప్లస్‌(+) మార్క్‌పై క్లిక్‌ చేసి కింద ఉన్న వీడియోని ఎంచుకుని ఫార్మేట్‌, మోడ్‌, ఫ్రేమ్స్‌…. ఇలా తెలిసిన మేరకు కావల్సిన మార్పులు చేసుకోవాలి. తర్వాత ‘అవుట్‌పుట్‌ ఫోల్డర్‌’ను ఎంపిక చేసుకోండి. అంటే ట్రాన్స్‌కోడ్‌ చేసిన తర్వాత ఆ ఫైల్స్‌ ఎక్కడ సేవ్‌ అవ్వాలనేది ముందే నిర్ధారించుకోవచ్చు. అంతా పూర్తయిన తర్వాత స్టార్‌ ట్రాన్స్‌కోడింగ్‌ జాబ్స్‌ (Start Transcoding Jobs) ను ఎంచుకుంటే చాలు. అంతే మీరు కోరుకున్న వీడియో ఫైల్‌ తయారయిపోతుంది. మీరు ఎంచుకున్న ఫైల్స్‌ పూర్తివివరాల్ని ఎడమవైపున ప్రాపర్టీస్‌(Properties)లో చూసుకోవచ్చు. డౌన్‌లోడ్‌, మరిన్ని వివరాలకు…

www. mediacoderhq. com/download.htm ను చూడండి.

- శాంతిశ్రీ

0 Response to "సినిమాల్ని కుదిద్దామా..!"

కామెంట్‌ను పోస్ట్ చేయండి