ఒక్క క్లిక్‌తో.. పిడిఎఫ్‌

నచ్చిన వ్యాసం, పాఠం, కవిత దగ్గర నుంచి రైల్వే రిజర్వేషన్‌ వరకూ ఇలా ఆన్‌లైన్‌లో అన్నీ బ్రౌజ్‌ చేస్తున్నాం! ప్రింటర్‌ అనుసంధానమై ఉంటే ప్రింట్‌ తీసేస్తాం. మన ప్రియస్నేహితులకూ ఆ సమాచారం పంపాలనుకుంటే పంపుతాం. వీటన్నింటికీ అనుకూలమైన ఫైల్‌ ఫార్మేట్‌ మనందరికీ తెలిసిన పిడిఎఫ్‌. దీన్నే విపులంగా ‘పార్టబుల్‌ డాక్యుమెంట్‌ ఫార్మేట్‌’ అంటారు. మీరు బ్రౌజ్‌ చేసిన వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌, వెబ్‌ పేజీలను పిడిఎఫ్‌ ఫార్మేట్‌లోకి మార్చాలంటే? మనం తెలుగులో చేసిన ఫైల్‌ నీ స్నేహితులకు పంపాలంటే వారి వద్దా ఆ తెలుగు ఫాంట్‌ ఉండాలి. వారి దగ్గర ఆ తెలుగు ఫాంట్‌ లేనప్పుడు మన ఫైల్‌ వారు చదవాలంటే? పిడిఎఫ్‌ క్రియేటర్‌ను ఇనిస్టాల్‌ చేసుకుంటే సరి! ఓపెన్‌సోర్స్‌ కమ్యూనిటీ వారు దీన్ని తయారుచేశారు. పీఎన్‌జీ, ఎపీ ఈజీ, బీఎంపీ, టిఫ్‌, ఈపీఎన్‌ ఇమేజ్‌ ఫైల్‌ ఫార్మేట్స్‌ను కూడా పీడీఎఫ్‌లోకి మార్చుకోవచ్చు.

ప్రత్యేకతేంటంటే..?!

నెట్‌ నుంచి బ్రౌజ్‌ చేసిన ఫైల్స్‌, ఇతర ఫైల్స్‌ని ఒకే క్లిక్‌తో పిడిఎఫ్‌లోకి మార్చేయవచ్చు. ఫైల్‌ ఏదైనా దానిపై రైట్‌ క్లిక్‌ చేసి వచ్చిన ఆప్షన్‌లో ‘పిడిఎఫ్‌ క్రియేటర్‌’ను ఎంచుకుంటే చాలు ఫార్మేట్‌ మారిపోతోంది. కొంత ప్రాసెస్‌ జరిగిన తర్వాత పిడిఎఫ్‌ ప్రింట్‌ మానిటర్‌ విండో ప్రత్యక్షమవుతుంది. దాంట్లోని ఆప్షన్ల ద్వారా పిడిఎఫ్‌లోకి తేలిగ్గా మార్చొచ్చు. కావాలంటే ప్రింట్‌ తీసుకోవచ్చు. ఇనిస్టాలేషన్‌ క్రమంలోనే ఈ పిడిఎఫ్‌ క్రియేటర్‌ను టూల్‌బార్‌ రూపంలో బ్రౌజర్‌లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో మీకు కావాల్సిన వెబ్‌ పేజీలను సులువుగా పిడిఎఫ్‌గా మార్చుకోవచ్చు. విండోస్‌, లైనెక్స్‌ వాడుతున్నవారు http://sourceforge.net/projects/pdfcreator నుండి దీన్ని డవున్‌లోడ్‌ చేసుకోండి.

– శాంతిశ్రీ

0 Response to "ఒక్క క్లిక్‌తో.. పిడిఎఫ్‌"

కామెంట్‌ను పోస్ట్ చేయండి