మొబైల్ లేకుండా క్షణం ఉండలేం. మరి అది పాడవగానే ఏం చేస్తారు? ఓ మూల పడేస్తారు. అవునా..? అంటే.. మీ చేజేతులా మీరే విలువైన లోహాల్ని వృథా చేస్తున్నట్లే. అంతేకాదండోరు! పర్యావరణానికీ హాని చేస్తున్నట్లే లెక్క. వీటిని సురక్షితమైన రీతిలో రీసైకిల్ చేయకపోతే వివిధరకాల కాలుష్య కారకాల్ని ఇంట్లో దాచినట్లే. అంతే కాదు.. ఒక్క మొబైల్‌లోనే రాగి-16 గ్రాములు, వెండి 0.35 గ్రాములు, బంగారు 0.034 గ్రాములు ఉన్నాయండోరు..! ఇలా మరెన్నో లోహాలు ఉంటాయని మీకు తెలియదు కదూ?
ఒక్క మొబైల్సే కాకుండా మూలపడేసిన కంప్యూటర్లు, టీవీల వల్ల మన దేశంలో ఇ-వ్యర్థాల పరిమాణం 2012 నాటికి ఎనిమిది లక్షల టన్నులు దాటవచ్చంట! దాంతో ఎలక్ట్రానిక్ కంపెనీలైన నోకియా, విప్రో, ఫిలిప్స్‌లాంటి పేరొందిన కంపెనీలు ఇ-వ్యర్థాలను అరికట్టేందుకు ‘టేక్ బ్యాక్’ కార్యక్రమాల్ని అమలుచేస్తున్నాయి. నోకియా కంపెనీ 10 దేశాల్లో 6,500 మందితో సర్వే చేయగా కేవలం మూడు శాతం మంది మాత్రమే సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా సగం మందికి వాటిని రీసైకిల్ చేయొచ్చనే సంగతే తెలియదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మన దేశంలోనైతే 17 శాతం మాత్రమే దీని గురించి తెలిసినవాళ్లు ఉన్నారు. సుమారు 44 శాతం మంది పాడైన ఫోన్‌లను ఇంట్లోనే ఉంచేస్తున్నారు. 2008లో మన దేశంలో 124 మిలియన్ల సెల్‌ఫోన్లు అమ్ముడయ్యాయని ఒక అంచనా. 2007తో పోలిస్తే వీటి అమ్మకాలు 24 శాతం పెరిగాయి. రీసైకిల్‌పై అవగాహన లేనివారు ప్రపంచం మొత్తం మీద బ్రిటన్‌లో అత్యధికంగా 80 శాతం మంది ఉన్నారండోరు!
మొట్టమొదట… నోకియా కంపెనీ ‘టేక్ బ్యాక్’ కార్యక్రమం ద్వారా వాడని ఫోన్‌లను సేకరించే ప్రయత్నం చేసింది కూడా. ఇందుకు దేశవ్యాప్తంగా నోకియా కేర్ సెంటర్‌లలో 1300 బాక్స్‌లను ఏర్పాటు చేసింది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకూ సేకరించిన మూడు టన్నుల ఇ-వ్యర్థాలను చూస్తే వీటిలో 10,000 ఫోన్‌లు, 10,000 బ్యాటరీలు, 32,000 ఛార్జర్లు, 16,000 హెడ్‌సెట్‌లు, బాడీ కవర్లు ఉన్నాయి. మరో ఆరునెలల్లో జాతీయస్థాయిలో ఈ కార్యక్రమాన్ని మళ్లీ చేపట్టనుంది.
* సైకిల్ ఎలా..? మొబైల్ ఇ-వేస్ట్‌ను మెటీరియల్ సెంటర్స్‌లో జాగ్రత్తగా వేరు చేస్తారు. తర్వాత గుర్తింపు పొందిన రీసైక్లింగ్ సెంటర్‌లకు పంపి తిరిగి ఉపయోగపడేలా చేస్తారు. లిథియం-అయాన్‌తో తయారుచేసిన బ్యాటరీల సామర్థ్యాన్ని సురక్షిత పద్ధతిలో తొలగించి కోబాల్ట్, నికెల్, రాగి, క్రోం, ఇనుము, అల్యూమినియంను వేరుచేస్తారు. ఈ పదార్థాలతో కొత్త బ్యాటరీలు, తాళాలు, స్పీకర్లు వంటి వాటిని తయారుచేయొచ్చు. అలాగే సర్క్యూట్ బోర్డ్, ఎల్‌సీడీ తెర, కెమేరాను కరిగించి విలువైన బంగారం, వెండి, పల్లేడియం, రాగి, లెడ్, నికెల్ లాంటి లోహాలను వేరు చేస్తారు. వీటితో ఆభరణాలు, ఇతర వస్తువులను తయారుచేస్తారు.
సాఫ్ట్‌వేర్ సమాచారం.. నోకియా సెల్‌ఫోన్‌ల్లో ‘ఎకో జోన్’ సాఫ్ట్‌వేర్‌ను ఇనిస్టాల్ చేయడం ద్వారా మొబైల్ రీసైక్లింగ్‌పై అవగాహన కల్గిస్తున్నారు. ఈ అప్లికేషన్‌లో రీసైక్లింగ్ అవసరాన్ని తెలియజెప్పే వాల్ పేపర్లు, వీడియోలు, వరల్డ్ వైడ్ ఫండ్ వివరాలు, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడే టిప్స్‌ను అందిస్తున్నారు. అలాగే భూతాపానికి (గ్లోబల్ వార్మింగ్) ఒక కారణంగా చెప్పుకునే ‘కార్బన్ డై ఆక్సైడ్’ను నియంత్రించడానికి ఉపయోగపడే అప్లికేషన్‌ను ఔవ:ఉటటరవ్‌ర పేరుతో అందజేస్తున్నారు. మరిన్ని వివరాలు కావాలంటే www.nokia. com/a41039029 ను చూడండి.
- శాంతిశ్రీ
0 Response to "మొబైల్ పాతదైతే…"
కామెంట్‌ను పోస్ట్ చేయండి